Breaking News

బిడ్డకు కట్నం ఏమిచ్చాడో తెలుసా..!

బిడ్డకు కట్నం ఏమిచ్చాడో తెలుసా..!

ఆదిలాబాద్: కట్నకానుకల కింద తమ బిడ్డ, అల్లుడికి బంగారు నగలు, స్థిరాస్తులు రాసి ఇస్తున్న ఈ తరుణంలో ఓ తండ్రి తన కూతురుకు విలువైన సంపద ఇచ్చాడు. అవేమిటో తెలుసా.. అరకపోయే జోడెద్దులు. ఈ సంస్కృతి సంప్రదాయం గిరిజన కుటుంబాల్లో తరతరాలుగా వస్తోంది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం వైజాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం సంగీతను ఆదిలాబాద్ మండలం ఛిచూధర్ ఖానాపూర్ గ్రామానికి చెందిన నైతం ప్రభుకు ఇచ్చి పెండ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. మంగళవారం పెళ్లికొడుకు ఇంటిలో పెండ్లి జరిగింది. తమ సంప్రదాయాన్ని కాపాడడంలో భాగంగా వరుడికి వధువు తల్లిదండ్రులు కాడెద్దుల ఎడ్ల జతను కట్నం కానుకల కింద ఇచ్చారు. పోడు వ్యవసాయమే ప్రధాన వృత్తిగా సాగుతున్న తమ జీవితాలకు ఎద్దులను ఇచ్చే సంస్కృతిని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్టు ఆత్రం శంభు తెలిపారు.