- బీజేపీ నాయకురాలు విజయశాంతి ధ్వజం
సామాజికసారథి,హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం అధికార పార్టీ చెప్పు చేతుల్లో పనిచేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదని బీజేపీ నాయకురాలు, మాజీఎంపీ విజయశాంతి విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కుమారుడు రాఘవ ఇప్పించిన పోస్టింగ్‌లో ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా వెళ్లలేని స్థితిలో పోలీసు అధికారులు ఉండిపోవడంతోనే రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ నాయకులు, వారి కుమారులు, బంధువులు చేసే ఆగడాలు అన్నీఇన్నీ కావన్నారు. నిజాం కాలంలో ప్రజలు బాధపడినట్లే నేడు కేసీఆర్సర్కార్ ఏలుబడిలో ప్రజలు అలాగే బాధలు పడుతున్నారని రాములమ్మ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆమె సోషల్‌మీడియాలో వీడియోను విడుదల చేశారు.