Breaking News

కరోనాపై భయం వద్దు.. జాగ్రత్తలు మేలు

కరోనాపై భయం వద్దు.. జాగ్రత్తలు మేలు

సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్నజిల్లాతో పాటు వేములవాడ నియోజకవర్గంలో మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు శుక్రవారం పర్యటించారు. తదనంతరం వేములవాడ తిప్పాపూర్ లోని వంద పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందన్నారు. కొవిడ్ తో పాటు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లాంటి వ్యాధులను నిర్మూలించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరూ భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కరోనాకు వ్యాక్సినేషన్ పూర్తయితేనే నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ కొరత లేదన్నారు. రాబోయే రోజుల్లో చిన్నారులపై కరోనా మహమ్మారి ప్రభావం చూపనున్నందున 50 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టే అవకాశం ఉందన్నారు. ఆస్పత్రిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అధికారులు దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, డాక్టర్లు, నర్సులు, జిల్లా, స్థానిక అధికారులు పాల్గొన్నారు.