సారథి, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఏపీ, తెలంగాణ బోర్డర్ పుల్లూరు టోల్ ప్లాజా వద్ద రాకపోకలను ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ బుధవారం పరిశీలించారు. అలంపూర్ ప్రాంతానికి కర్నూలు పట్టణం చేరువలో ఉండటంతో ప్రతి చిన్న పనికి అక్కడికి వెళ్లి రావాల్సి వస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. ఈ విషయమై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అక్కడికి వచ్చి పరిస్థితులను సమీక్షించి జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ఈ విషయమై ఎస్పీ సానుకూలంగా స్పందిస్తూ.. ఈ ప్రాంత రైతులు, ప్రజలు కర్నూలు వెళ్లి వచ్చేటప్పుడు వారి ఆధార్ కార్డు లేదా ఐడీప్రూఫ్ ఏదైనా చూపితే పంపిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. రాకపోకలు సాగించేవారు ఏదైనా గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఇక్కడ డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు సహకరించాలని కోరారు.
- June 16, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- మహబూబ్నగర్
- ALAMPUR
- GADWALA
- PULLUR
- sa sampath kumar
- అలంపూర్
- జోగుళాంబ గద్వాల
- పుల్లూరు
- సంపత్ కుమార్
- Comments Off on బోర్డర్ లో ఇబ్బందులు కలిగించొద్దు