Breaking News

చట్టవిరుద్దంగా వ్యహరించొద్దు

చట్టవిరుద్దంగా వ్యహరించొద్దు
  • దళితుడిని అక్రమ నిర్భందిస్తారా..?
  • పోలీసుల తీరుపై ఎమ్మెల్యే భగత్ ధ్వజం

సామాజిక సారథి, హాలియా:  పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించాలే కానీ, అందుకు విరుద్ధంగా వ్యవహరించి దళితులకు అన్యాయం చేస్తే సహించేది లేదని దళితుల వెంటే తెలంగాణ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి సాగర్ నియోజకవర్గంలో పలు శుభకార్యాలలో పాల్గొనేందుకు  వస్తుండడంతో హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట దళితులు ధర్నా చేస్తుండగా, ఎమ్మెల్యే కారు ఆపి నిడమానూరు మండల పరిధిలోని తుమ్మడం గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లు జరిగిన సంఘటన ఆయనకు వివరించారు. వివరాల్లోకి వెళితే హాలియా పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కిన్నెర జ్యోతి భర్త కొండల్, వెంకటేశ్వర్లు కలసి మిర్యాలగూడ మండల పరిధిలోని అవంతిపురం వద్ద గత జూలైలో 375 గజాల ప్లాట్ ని రూ.12 లక్షలకు కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం గడువులోపు రూ.12లక్షలు కానిస్టేబుల్ భర్త కొండల్ చెల్లించాల్సి ఉండగా అతను చెల్లించలేదు. గడువు సమీపిస్తుండటంతో ఆ డబ్బును వెంకటేశ్వర్లు చెల్లించి ప్లాట్ ను తన పేరుతో రిజిస్ట్రేషన్  చేసుకున్నారు. కొద్ది రోజులుగా హాలియా పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కిన్నెర జ్యోతి భర్త కొండల్ తమకు డబ్బు కావాలని ఒత్తిడి చేయడంతో కాగితం రాసి ఇస్తానని 100 రూపాయల బాండ్ పేపర్ పై రాసి అగ్రిమెంట్ తీసుకున్నారు. ప్లాట్ సమస్య పరిష్కరిస్తానని నిడమనూరు ఎస్ఐ, ఏఎస్ఐలు హాలియా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి ఇన్చార్జి సీఐ గౌరీ నాయుడు అప్పగించారని తెలిపారు. హాలియా ఇన్ చార్జి సీఐ, ఎస్ఐ అనుచిత వ్యాఖ్యలు చేశారని బాధితుడు వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేకు వివరించారు.