Breaking News

గణేశ్​ మండపాల వద్ద డీజేలకు అనుమతి వద్దు

డీజేలకు అనుమతి వద్దు

సామాజికసారథి, రామకృష్ణాపూర్: గణేశ్​ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల వద్ద డీజే, సినిమా పాటలకు తావివ్వకుండా భక్తి పాటలతో ఉత్సవాలను నిర్వహించుకోవాలని టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు సంజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని జీటీ హాస్టల్ బాలగణేష్ మండలి వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ, తెలంగాణ సంస్కృతిని తలపించేలా రామాయణం, మహాభారతం, సాంస్కృతి వేషధారణకు సంబంధించిన కార్యక్రమాలతో యువత, విద్యార్థులను చైతన్య పరిచేలా సెప్టెంబర్ 5న పట్టణంలోని జీటీ హాస్టల్ బాలగణేశ్​ మండలి వద్ద పోటీలను నిర్వహిస్తున్నామని, రిజిస్ట్రేషన్ కోసం కమిటీ సభ్యులు అఖిల్ ను సంప్రదించాలని కోరారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని, మొదటి బహుమతి రూ.10,116, రెండో బహుమతి రూ.5,116, మూడో బహుమతి రూ.2,116 విజేతలకు అందజేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాజన్న, ఐలయ్య, మలయ్య, రాములు, రవి, శివకృష్ణ, కుమార్, సంతోష్, వెంకటేష్, సాయి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

5 thoughts on “గణేశ్​ మండపాల వద్ద డీజేలకు అనుమతి వద్దు

  1. కొత్తపల్లి గ్రామంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు

    1. గ్రామంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

  2. సామాజిక సారథి వంగూరు
    గ్రామంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

  3. సామాజిక సారథి వంగూర్

    డిసిసిబి నిధులతో కళ్ళం ఏర్పాటు

    మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో డిసిసిబి నిధులు 3 లక్షల రూపాయలతో సింగిల్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి సొసైటీ భూమిలో రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి కళ్ళం ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించారు ఈ కళ్ళం అందుబాటులోకి వస్తే వివిధ గ్రామాలకు సంబంధించిన రైతులు సొసైటీ దగ్గర ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి అందుబాటులో ఉంటుందని తెలియజేశారు అలాగే గోదామును కూడా కట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో సింగల్ విండో సీఈవో విష్ణుమూర్తి గ్రామ ప్రజలు పాల్గొన్నారు

  4. *💥🔥ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్🔥💥*

    *ఈ రోజు సాయంత్రం 4.:30 గంటలకు వంగూరు మండల్ అన్నారం గ్రామంలో ప్రభుత్వ విప్ & ఎమ్మెల్యే శ్రీ గువ్వల బాలరాజు గారి సమక్షంలో అన్నారం గ్రామం లో సిపిఎం పార్టీ గ్రామ సర్పంచ్ గౌరమ్మ లక్ష్మణ్ గారు అన్నారం గ్రామంలో టిఆర్ఎస్ లో చేరుతున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి కూడా మరి కొంత మంది చేరబోతున్నారు కావున మండల TRS పార్టీ కుటుంబ సభ్యులు అందరూ తప్పక హాజరు కాగలరు*
    *ఇట్లు*
    *మండల అధ్యక్షులు*
    *కృష్ణా రెడ్డి*

Comments are closed.