సామాజిసారథి, హైదరాబాద్: రేషన్ కార్డు దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బియ్యం పంపిణీ చేసే గడువును ఐదు రోజులకు పెంచింది. ప్రతి నెల ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ ప్రారంభమవుతుంది. అలాగే రేషన్ పంపిణీ ప్రక్రియ 15 రోజుల పాటు కొనసాగుతుంది. మాములుగా అయితే అదే నెల 1వ తేదీన ప్రారంభమైన రేషన్ పంపిణీ ప్రక్రియ అదేనెల 15న ముగుస్తుంది. అయితే ఈ జనవరి మాసంలో కొన్ని అనివార్య కారణాల వల్ల రేషన్ కార్డులు పంపిణీలో జాప్యం కావడంతో బియ్యం పంపిణీ కూడా ప్రారంభం కాలేదు. జనవరి 5వ తేదీ నుంచి బియ్యం పంపిణీ చేశారు. దీంతో ఈనెల 20వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.