Breaking News

టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం
  • ఎమ్మెల్యే నోముల భగత్

సామాజిక సారథి, హలియా: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నఅభివృద్ధికి ఆకర్షితులై అధిక సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని నాగార్జున సాగర్ నియోజక వర్గం ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం సాయంత్రం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు ఆలీనగర్ కి చెందిన 89 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై రాష్ట్ర మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవెల్లి విజయేందర్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ యడవెల్లి నీలిమామహేందర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ గౌరవ సలహాదారుడు వెంపటి శంకరయ్య, మండల పార్టీ అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.