Breaking News

ఏసీబీకి పట్టుబడ్డ డిప్యూటీ తాసిల్దార్

సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో : కొల్లాపూర్ నియోజక వర్గం లోని కోడేరు మండల తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ పురుషోత్తం పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ లకు పట్టు పడ్డాడు . ఏసీబీ అధికారి శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం రాజాపూర్ గ్రామానికి చెందిన నాగేందర్ అనే రైతుకు సంబంధించిన ఒక ఎకరా 20 గుంటల భూమి విరాసతకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా గత ఆరు నెలల నుండి దరఖాస్తును తిరకాసులు పెట్టి పదేపదే రైతులు వేధించడంతో చేసేది లేక రైతు డిప్యూటీ తాసిల్దార్ పురుషోత్తం రైతును పదివేల రూపాయలు లంచం అడుగగా రైతు ఇస్తానని ఒప్పుకొని హైదరాబాదులోని ఏసీబీ అధికారులకు సోమవారం ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారుల బృందం గంటల 3:30 నిమిషాలకు కోడేరుకు చేరుకొని రైతుతో డిప్యూటీ తాసిల్దార్ కు డబ్బులు ఒప్పందం చేసుకునే విధంగా చేసి రైతు నుంచి డబ్బులు తీసుకున్న డిప్యూటీ తాసిల్దార్ పై ఏకంగా కార్యాలయంలోకి ఏసీబీ అధికారులు వచ్చి పట్టుకున్నామని , విచారణ అనంతరం డిప్యూటీ తాసిల్దారుని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు .