Breaking News

జనసంద్రమైన… పటాన్‌చెరు పట్టణం

జనసంద్రమైన... పటాన్‌చెరు పట్టణం
  • అంబరాన్ని అంటిన కేసరి లాల్ యాదవ్ సంగీతం  
  • మారు మోగిన జీఎంఆర్ నినాదాలు
  • జనసంద్రంగా మైత్రి క్రీడా మైదానం                                               
  • తరలివచ్చిన ఉత్తర భారతీయులు
  • మినీ ఇండియాకు నిర్వచనం పటాన్‌చెరు
  • ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

సామాజిక సారథి, పటాన్‌చెరు: పటాన్‌చెరు పట్టణం జనసంద్రంగా మారినట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మైత్రి మైదానంలో ఉత్తర భారతీయుల పవిత్రమైన పండగ ఛట్ పూజకు భోజ్ పూరి నటుడు కేసరి లాల్ యాదవ్ సంగీత విభావరి, అందరిని ఉర్రూతలూగించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారి ఒకే వేదిక దగ్గర వేలాదిమంది ఉత్తర భారతీయులతో సమావేశం ఏర్పాటు చేయడం తన జీవితంలో ఇది ఒక మరిచిపోలేని అనుభూతి అన్నారు. ఉన్న ఊరిని విడిచిపెట్టి పొట్టకూటి కోసం పటాన్‌చెరు నియోజకవర్గానికి తరలివచ్చిన ప్రతి ఉత్తర భారతీయుడిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలిపారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తక్షణమే అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా తమకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పటాన్‌చెరులో జరిగిన ఛట్ పూజకు హాజరైన రాష్ట్రాలు

 పటాన్‌చెరులో నియోజకవర్గంలో జరిగిన ఛట్ పూజకు ఇస్నాపూర్, పాశ మైలారం, రామచంద్రాపురం, బొల్లారం, పటాన్‌చెరు తదితర పారిశ్రామిక వాడలతో పాటు ఉత్తర్ ప్రదేశ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాంచల్ తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ప్రజలు తమ అభిమాన నటుడి ప్రత్యక్ష సంగీత విభావరిని తిలకించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వేల సంఖ్యలో తరలివచ్చారు. ఇందుకు అనుగుణంగా ఎమ్మెల్యే జీఎంఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నిర్వహించిన సంగీత విభావరి అందరినీ ఉర్రూతలూగించింది.

ది రియల్ లీడర్ ఎమ్మెల్యే జీఎంఆర్…

  • నటుడు, గాయకుడు కేసరి లాల్ యాదవ్

తన నట జీవితంలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో పటాన్‌చెరులో సంగీత విభావరిలో పాల్గొన్నానని తెలిపారు. విమానాశ్రయం నుండి వేదిక వరకు అడుగడుగునా ఘనస్వాగతం పలకడం ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన సొంత కొడుకు వలె ఆప్యాయంగా పలకరించి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇచ్చిన ఆతిథ్యం మరిచిపోలేని జ్ఞాపకం అన్నారు. ఛట్ పూజా సందర్భంగా వేలాదిమంది ఉత్తర భారతీయులతో కలిసి తన సంగీత విభావరి ఏర్పాటు చేయడం అద్భుతం అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే జీఎంఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించుకొని, కృతజ్ఞత తెలుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసరి లాల్ యాదవ్ ను ఎమ్మెల్యే జీఎంఆర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రామచంద్రాపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్,నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, పాల్గొన్నారు.