Breaking News

పంటపొలాల్లో పొంచి ఉన్న ప్రమాదం

పంటపొలాల్లో పొంచి ఉన్న ప్రమాదం
  • ఆ పొలంలోకి రామంటున్న కూలీలు
  • కూలీలు రాకపోవడంతో రైతుల్లో ఆందోళన
  • విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని స్థానిక రైతుల ఆరోపన

సామాజిక సారథి, కౌడిపల్లి: పంట పొలంలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయని వాటిని సరిచేయాలని పలుమార్లు సంబంధిత విద్యుత్ సిబ్బందికి చెప్పినా పట్టించుకున్న పాపానపోలేదని స్థానిక రైతులు వాపోతున్నారు. కౌడిపల్లి సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వెనకాల ధర్మసాగర్ కట్ట వద్దనున్న 33/11 కెవి విద్యుత్ స్తంభాలు పంట పొలంలో వంగి ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలంలో కొన్నేండ్లుగా తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్న అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదని  రైతులు ఆరోపిస్తున్నారు. ఓవైపు వంగినా స్తంభాలతో, మరోవైపు వేలాడిన విద్యుత్ వైర్లతో పొలాల్లో పని చేసుకునే రైతన్నలు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయం భయంగా వ్యవసాయ పనులు చేసుకోవాల్సి వస్తుందని రైతులు చెప్పుతున్నారు. ఈ పంటపొలంలో పని చేసేందుకు వ్యవసాయ కూలీలు సైతం నీరాకరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైన విద్యుత్ ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్ వైర్లు, స్తంబాలకు మరమత్తులు చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు.