సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియను భౌతికంగా నిర్వహించాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్టో) నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా బదిలీల ప్రక్రియ నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పర్వతరెడ్డి, మురళి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
- December 28, 2021
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- counseling
- manage
- physically
- TEACHERS
- TRANSFER
- కౌన్సెలింగ్
- టీచర్ల
- నిర్వహించాలి
- బదిలి
- భౌతికంగా
- Comments Off on కౌన్సెలింగ్ భౌతికంగా నిర్వహించాలి