Breaking News

పిలవని పేరంటానికి రావొద్దు!

పిలవని పేరంటానికి రావొద్దు!
  • కాంగ్రెస్ కు నష్టం చేస్తే సహించేదిలేదు
  • పూటకో పార్టీ మారే వారిని మేం తీసుకోం
  • డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ముక్తార్ క్లారిటీ

సామాజికసారథి, నాగర్ కర్నూల్: బిజినేపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో గత వారం రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ లీడర్ గా వచ్చి ఫొటోలు దిగుతుండటం పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. అలాంటి వ్యక్తితో పార్టీకి నష్టం జరుగుతుందని కార్యకర్తలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని పిలవకుండా వారే వచ్చి ఫొటోలు దిగుతున్నారని తేల్చిచెప్పారని డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ముక్తార్ అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మైండ్ గేమ్ ఆడుతున్న అలాంటి వారితో కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో పాలెం గ్రామంలో లీడర్ లేకున్నా కలిసికట్టుగా కార్యకర్తలే పనిచేసి 550 ఓట్లకు పైగా మెజార్టీ తీసుకొచ్చారని, కష్టపడి పనిచేసిన వారికే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉంటారని స్పష్టంచేశారు. అధికారం కోసం బీఆర్ఎస్ నుండి బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పార్టీని నష్టపరుస్తామంటే సహించేది లేదన్నారు. మరోసారి వచ్చి కార్యకర్తల మధ్యల ఫొటోలు దిగితే మెడబట్టి దొబ్బే రోజులు ఉన్నాయని హెచ్చరించారు. అధికారం కోసం పూటకో పార్టీ మారే వారిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తీసుకోదని తెలిపారు. మీ మైండ్ గేమ్ ను తమ కార్యకర్తల వద్ద చూపించవద్దని కోరారు. పిలవని పేరంటానికి వచ్చి అవమానం పడే మీలాంటి నాయకులను చూసి తమ కార్యకర్తలు నవ్వుతున్నారని అన్నారు. మీకు సమాచారం లేకుండా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సమావేశాలకు వచ్చి ఫొటోలు దిగి కాంగ్రెస్ కార్యకర్తలను చెప్పుకుంటే మాత్రం ఇకనుంచి సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి, గోవింద రామకృష్ణ, మాన్యనాయక్, యాదగిరి, లక్ష్మణ్ నాయక్, కైసర్ పాల్గొన్నారు.