Breaking News

రేవంత్​ రెడ్డి ప్రమాణ స్వీకారానికి తరలిన లీడర్లు

రేవంత్​ప్రమాణ స్వీకారానికి తరలిన లీడర్లు

సారథి, పెద్దశంకరంపేట/గొల్లపల్లి/రామడుగు: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమానికి తరలిన వారిలో రాయిని మధు, జనార్ధన్, రాజేందర్ గౌడ్, జైహింద్ రెడ్డి, నారాగౌడ్, ఎంపీటీసీ సభ్యుడు రాజునాయక్, సాయిరెడ్డి, రఘుపతిరెడ్డి, రాంచందర్, సంగమేశ్వర్ ఉన్నారు.

గొల్లపల్లిలో కాంగ్రెస్​ నేతల సంబరాలు

– జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల చిల్వకోడూరు గ్రామంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బద్రి రవి, మాజీ ఎంపీటీసీ దాసరి తిరుపతి, యూత్ కాంగ్రెస్ నాయకులు వేణు, నక్కరాజు, కార్యవర్గ సభ్యులు సంతోషం వ్యక్తంచేస్తూ పటాకులు కాల్చి.. మిఠాయిలు పంచారు.

చొప్పదండి నుంచి తరలివెళ్తున్న కాంగ్రెస్​నాయకులు

– పీసీసీ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి మద్దతుగా చొప్పదండి నియోజకవర్గ ఇన్​చార్జ్ ​మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో రామడుగు మండల కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ కు తరలివెళ్లారు. వారిలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మరవేణి తిరుపతి, ఎంపీటీసీ జవాజీ హరీశ్, మహమ్మద్, అసిఫ్, కృష్ణ, శంకర్, వీరయ్య ఓంప్రకాశ్, మాజీ సర్పంచ్ రాములు, మాజీ ఎంపీటీసీ మహేష్ ఉన్నారు.