సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గుండిగోపాల్ రావుపేట ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలోని వ్యాక్సినేషన్ సెంటర్ ను కలెక్టర్ శశాంక బుధవారం సందర్శించి వ్యాక్సినేషన్ తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతిఒక్కరూ వాక్సిన్ వేసుకునేలా మోటివేషన్ చేయాలని సూచించారు. కరోనా పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలు రావడం లేదని, అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని సర్పంచ్, ఉపసర్పంచ్, వైస్ ఎంపీపీ కలెక్టర్ శశాంకను కోరారు. ఆయన వెంట ఎంపీడీవో మల్హోత్రా, తహసీల్దార్ కోమల్ రెడ్డి, ఎంపీవో సతీష్ రావు, రామడుగు గుండిగోపాల్ రావుపేట మెడికల్ ఆఫీసర్లు శ్రీనివాస్, బిజిలి శ్రీను, గోపాల్ రావుపేట సర్పంచ్ కర్ర సత్యప్రసన్న, రామడుగు సర్పంచ్ పంజాల ప్రమీల, ఉపసర్పంచ్ వడ్లూరి రాజేందర్, వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్, ఎంపీటీసీ ఎడవెళ్లి నరేందర్, పంజాల జగన్ మోహన్, కల్గెటి లక్ష్మణ్, ఆరిఫ్, కాంతయ్య పాల్గొన్నారు.
- May 26, 2021
- Archive
- Top News
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- KARIMNAGAR
- RAMADUGU
- VACCINATION
- కరీంనగర్
- కరోనా
- రామడుగు
- వ్యాక్సినేషన్
- Comments Off on వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్