Breaking News

మేడారం జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

మేడారం జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

సామాజిక సారథి, ములుగు: పిబ్రవరి 16 నుండి 19 వరకు జరిగే మేడారం మహా జాతర ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన    సేక్టరియాల్ అధికారుల సమావేశంలో అయన మాట్లాడారు. కుంభ మేళాను తలపించే అతి పెద్ద గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అ సౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు ప్రణాళిక బద్దంగా ఉండాలన్నారు.గత జాతరను దృష్టిలో ఉంచుకొని  ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ అన్నారు.జాతర సెక్టోరియల్ అధికారులు,ఎలక్ట్రిసిటీ అధికారులు, పోలీసు శాఖ అధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఐలా త్రిపాఠీ, ఎలక్ట్రిసిటీ ఎస్. మల్చుర్  డీఆర్వో రమాదేవి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, డీఎల్పీవో దేవరాజ్, తాడ్వాయి తాసిల్దార్ శ్రీనివాస్,  ములుగు తాసిల్దార్ సత్యనారాయణ స్వామి, వెంకటాపురం తాసిల్దార్ నాగరాజ్,  ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, కలెక్టరేట్ ఏవో శ్యామ్, కలెక్టరేట్ సూపరింటెండెంట్  రాజ్ ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.