Breaking News

కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్

కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
  • షోకాజ్ నోటీసు జారీ చేసిన వీడని నిర్లక్ష్యం
  • ఈవో పనితీరుపై సర్వత్రా విమర్శలు

 సామాజిక సారథి, పెద్దశంకరంపేట: గత జూలై 5వ తేదీన పల్లె ప్రగతి పనులను పరిశీలించడానికి పెద్ద శంకరంపేట మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా  కలెక్టర్ హరీష్ పెద్దశంకరంపేట పారిశుధ్యంపై పేట పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రత్యేకంగా 161జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రియాంక కాలనీలో మురికి కాలువలో నుండి మురికి నీరు రోడ్డుపై ప్రవహించడాన్ని గమనించిన కలెక్టర్ పంచాయతీ కార్యదర్శి విట్టల్ పై ఆగ్రహం వ్యక్తం చేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ పంచాయతీ కార్యదర్శి 6నెలలు గడుస్తున్నా ఆ పనుల పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈవో పని తీరుకు నిదర్శనం పడుతుంది. ఈఓ పనితీరు పట్ల ప్రజలు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శిని స్థానికులు ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్తూ తప్పించుకున్నాడని స్థానికులు తెలిపారు. మండల పరిధిలోని చిల్లపల్లి పంచాయతీ కార్యదర్శిని పనులలో అలసత్వం వహించినందుకు గాను జిల్లా కలెక్టర్ హరీష్ సస్పెన్షన్ కు గురి చేసినప్పటికిని ఈవో విట్టల్ లో ఎలాంటి మార్పు రాలేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.