సారథి, రామాయంపేట: రైతాంగం గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యారని, రైతాంగాన్ని ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ఏడాదికి రూ.12వేల కోట్ల ఖర్చుతో ఉచితంగా కరెంటు అందిస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం మెదక్‌జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్ లో నిజాంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను ప్రారంభించారు. అలాగే నిజాంపేట జడ్పీ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ సెంటర్ ను పరిశీలించారు. అనంతరం మండలంలోని జడ్ చెర్వు గ్రామంలో రామయంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో ఆదుకున్నారని గుర్తుచేశారు. గతంలో అన్నదాతలు దళారులను నమ్మి మోసపోయేవారని వివరించారు. కార్యక్రమంలో జెడ్ చెర్వు సర్పంచ్ అరుణ్ కుమార్, సహకార సంఘాల చైర్మన్లు చైర్మన్లు బాపురెడ్డి, చంద్రం, డైరెక్టర్లు అబ్దుల్ అజీజ్, చల్మేడ ఎంపీటీసీ బాల్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
- April 22, 2021
- Archive
- Top News
- CM KCR
- RAMAYAMPET
- RYTHUBANDHU
- TELANGANA
- తెలంగాణ
- రామాయంపేట
- రైతుబంధు
- సీఎం కేసీఆర్
- Comments Off on రైతులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్‌దే..