సారథి, హైదరాబాద్: కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఏప్రిల్ 19న ఆయనకు కరోనా అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన గజ్వేల్‌లోని తన ఫాంహౌజ్‌లోనే ఐసోలేషన్‌లో ఉండిపోయారు. 28న ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో వైద్యులు ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా, నెగెటివ్ అని వచ్చింది. 29న ఆర్టీపీసీఆర్‌లో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. చివరికి మే 4న కరోనా నుంచి సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకున్నారని వ్యక్తిగత వైద్యులు ధ్రువీకరించారు. దీంతో రెండు వారాల తర్వాత ఆయన ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ప్రగతి భవన్‌కు రాగానే పలు ప్రభుత్వ కార్యక్రమాలు, కోవిడ్ పై సమీక్షలు చేసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
- May 6, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- CM KCR
- TELANGANA
- కరోనా
- తెలంగాణ
- ప్రగతి భవన్
- సీఎం కేసీఆర్
- Comments Off on ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్