Breaking News

స్థానిక సంస్థల్లో కారే దూసుకెళ్లింది

స్థానిక సంస్థల్లో కారే దూసుకెళ్లింది
  • టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి ఘన విజయం

 సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: ఎమ్మెల్సీ ఎన్నికలో రేసులో అంతా అనుకున్నట్లే కారే గెలిచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి ఘన విజయం సాధించారు. నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నిక అనంతరం మహిళా సమాఖ్య భవన్ లో మంగళవారం  కౌంటింగ్ ఉదయం నిర్వహించారు.  ఏడుగురు అభ్యర్థు పోటీ పడిన ఈ ఎన్నికల్లో 1271 ఓట్లుకుగాను, 1233 ఓట్లు పోలయ్యాయి. కాగా, కౌంటింగ్ లో ఎంసీ కోటిరెడ్డికి మొత్తం 917 ఓట్లు పోలై, 691 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ జడ్పీటీసీ, స్వత్రంత్ర్య అభ్యర్థి నగేష్ కు 226 ఓట్లు, వంగురి లక్మయ్యాకు 26, ఓట్లు,  కసర్ల వెంకటేశ్వర్లుకు 6 ఓట్లు,  ఏర్పుల శ్రీశైలానికి  3 ఓట్లు, బెజ్జం సైదులుకు ఒక్క ఓటుకూడా పడలేదు. 50 ఓట్లు చెల్లలేదని అధికారులు ప్రకటించారు. కౌంటింగ్ కోసం 200 మంది సిబ్బందిని అధికారులు నియమించారు. అభ్యర్థుల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి, 25 చొప్పున బండిల్స్ కట్టి, నాలుగు టేబుళ్లపై లెక్కించారు. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.

  • ఎమ్మెల్సీ కోటిరెడ్డి ద్రువీకరణ పత్రం అందజేత

ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో మంగళవారం ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డికి రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ద్రువీకరణ పత్రాన్ని అందించారు. ఎన్నికల పరిశీలకులు అహ్మద్ నదీమ్, రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జి.జగదీశ్ రెడ్డి, డిఐజీ, ఏవీ రంగనాథ్, ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎన్. భాస్కర్ రావు, నోముల  భగత్,  నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, యాదాద్రి జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, సూర్యాపేట జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ అధికారులు మోహన్ రావు, తదితర అధికారులు ఉన్నారు.