Breaking News

ప్రశాంతంగా, పారదర్శకంగా వైన్ షాపుల కేటాయింపు

ప్రశాంతంగా, పారదర్శకంగా వైన్ షాపుల కేటాయింపు

– కలెక్టర్ హనుమంతరావు

సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి:  ప్రశాంతంగా పారదర్శకంగా వైన్స్ షాపుల కేటాయించామని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపపల్లి ఎక్స్ రోడ్డులోని ఎంబీఆర్ గార్డెన్ లో లక్కీడ్రాలో పాల్గొని మాట్లాడారు.  జిల్లా వ్యాప్తంగా 101 మద్యం దుకాణాలకు గాను 2,310 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. అమిన్పూర్ మున్సిపాలిటీలోని  43 నెంబర్ దుకాణానికి అత్యధికంగా 53 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. పటాన్ చెరువు మండలం ఇంద్రేశం గ్రామంలలోని 40 నెంబర్ షాపుకు 52,  కోహిర్ మండలం కవేలి గ్రామ 70 నెంబర్ కు 46 దరఖాస్తులు, కోహీర్ లోని 69 నెంబర్ దుకాణానికి 45, ఝరాసంగం గ్రామ 74 నెంబర్ షాపుకు 44దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ చెప్పారు. అత్యల్పంగా జిన్నారం మండలం సోలక్ పల్లి గ్రామంలోని 55 షాపునెంబర్ కు, కల్హేర్ మండలం మాసాన్ పల్లిలోని 55షాపుకు, 84 దుకాణాలకు 11 చొప్పున దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. లక్కీడ్రాలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి గాయత్రి, పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, వైద్య, ఆరోగ్యశాఖ  అధికారులు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.