- డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పూర్తి కావాలి
- కలెక్టర్ హనుమంతరావు
సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. డిసెంబర్ పదవ తేదీలోపు ఇళ్ల నిర్మాణాలను పూర్తి సిద్ధం చేయాలన్నారు. అన్ని మౌలిక వసతులతో పాటు అందించాలన్నారు. నిర్మాణంలో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలన్నారు. ఆయా పనులన్నింటినీ పూర్తిచేసి ప్రారంభించడానికి సిద్ధం చేసేలా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, డిఆర్ ఓ శ్రీనివాస్ రావు, హౌసింగ్ నోడల్ అధికారి తుమ్మ ప్రసాద్, ఆర్ అండ్ బి ఈ ఈ సురేష్, పంచాయతీ రాజ్ ఈ ఈ జగదీశ్వర్, సివిల్ సప్లైస్ డి ఎం సుగుణ భాయ్, డి ఈ లు, తదితరులు పాల్గొన్నారు.