- బాగ్ అంబర్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మవెంకట్ రెడ్డి
సామాజిక సారథి, ఉప్పల్: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఉప్పల్ బాగ్ అంబర్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మవెంకట్ రెడ్డి తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ, తంగడపల్లి గ్రామంలో బాగ్ అంబర్ పేట డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థిని మునుగోడు ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇంచార్జ్ బీ. వెంకట్ రెడ్డి, డివిజన్ బీజేపీ అధ్యక్షులు చుక్క జగన్, బీజేపీ నాయకులు మిర్యాల శ్రీనివాస్, రమేష్ ముదిరాజ్, గుగ్గిళ్ల శ్రీనివాస్, బాలకృష్ణ గౌడ్, జీవీ గుప్త, సునంద, సరళ, మహేశ్వరి, సుగుణ పాల్గొన్నారు.