సారథి న్యూస్, వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామ సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వర్రావుకు ఉత్తమ సర్పంచ్ అవార్డు దక్కింది. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ ఎల్.శర్మన్, జడ్పీ చైర్పర్సన్ పద్మావతి చేతులమీదుగా అందుకున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, ట్యాంకులు, రైతు వేదిక, శ్మశాన వాటిక నిర్మాణంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టినందుకు ఈ అవార్డు వచ్చిందని సర్పంచ్ పి.వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఈ అవార్డు రావడం తనకు మరింత బాధ్యత పెంచిందన్నారు. కొట్ర గ్రామంలో వీధివీధినా సీసీరోడ్లు వేయడంతో పాటు హైస్కూలుకు ప్రహరీ నిర్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం, హెల్త్ సబ్‌సెంటర్, ఆంజనేయ స్వామి ఆలయాన్ని పూర్తిచేయడమే తన ముందున్న కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. ఉత్తమ అవార్డు గ్రహీత సర్పంచ్ పి.వెంకటేశ్వరరావును కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్‌యాదవ్, కొట్ర ఎంపీటీసీ రాములు, పలువురు అధికారులు, టీఆర్ఎస్పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.
- January 26, 2021
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- COLLECTOR SHARMAN
- KOTRA SURPUNCH
- MLA JAYPAL YADAV
- NAGARKURNOOL
- VELDANDA
- కలెక్టర్ శర్మన్
- కల్వకుర్తి
- కొట్ర సర్పంచ్
- నాగర్‌కర్నూల్
- వెల్దండ
- Comments Off on కొట్ర సర్పంచ్‌కు ఉత్తమ అవార్డు