- ఉన్నతస్థాయి సమీక్షలో సీఏం వైఎస్జగన్
అమరావతి: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ఓటీఎస్ పై అవగాహన కల్పించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం, ఓటీఎస్ పథకంపై సీఎం జగన్ బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఓటీఎస్‌పై అవగాహన కల్పించాలని, ఓటీఎస్ అనేది పూర్తి స్వచ్ఛందమని స్పష్టం చేశారు. రూ.10వేల కోట్ల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని పేర్కొన్నారు. రుణాలు మాఫీ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్‌కూడా ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. వారికి సంపూర్ణ హక్కులు వస్తాయని తెలిపారు. అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చు.. అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని పేర్కొన్నారు. పేదలకు మంచి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఆ అవకాళాలు వాడుకోవాలా? లేదా? అన్నది వారిష్టమని చెప్పారు. వారికి సంపూర్ణ హక్కులు కల్పిస్తూ మేలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీరంగనాథరాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.