సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌కు సంబంధించిన పరీక్షల ఫీజుల చెల్లింపు తేదీలను ఇంటర్ మీడియట్బోర్డు ఖరారు చేసింది. బుధవారం నుంచి ఈ నెల 24 వరకు చెల్లించవచ్చని తెలిపింది. నిర్ణీత సమయంలో ఫీజు చెల్లించనివారు.. లేటు ఫీజుతో ఫిబ్రవరి 21వ తేదీ వరకు చెల్లించవచ్చని బోర్డు కార్యదర్శి జలీల్ ప్రకటించారు. లేటు ఫీజు రూ.100తో ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు చెల్లించవచ్చని సూచించారు. రూ.రెండువేలతో ఫిబ్రవరి 15 నుంచి 21వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. ఇటీవల ఫస్టియర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.