Breaking News

అంబులెన్స్ సౌకర్యం కల్పించాలి

అంబులెన్స్ సౌకర్యం కల్పించాలి

డీఎంహెచ్ఓ కొండలరావుకు  వినతి

సామాజిక సారథి, నల్లగొండ:  ఇరవై గ్రామ పంచాయతీలు, యాభై వేల పైచిలుకు ఉండే జనాభాకు అంబులెన్సు సౌకర్యంలేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మర్రిగూడ మండల కేంద్రంలో  ఉన్న ముప్పై పడకల ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతూ  ఆ గ్రామ సర్పంచ్ నల్ల యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో  గ్రామస్తులు గురువారం జిల్లా కేంద్రంలోని  డీఎంహెచ్వో కొండలరావు కు వినతిపత్రం అందజేశారు. గతంలో  రోగుల రవాణా సౌకర్యార్థం కొరకు  అప్పటి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్  ఆస్పత్రికి అంబులెన్స్ను ఏర్పాటు చేశారని  కరొనా  సమయంలో  అటు అంబులెన్స్ను జిల్లాకేంద్రానికి తీసుకువచ్చారని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఉన్నతాధికారులు స్పందించి వెంటనే  అంబులెన్సులు  ఆస్పత్రిలో ఏర్పాటు చేయాలని వారు కోరారు.  వినతిపత్రం అందజేసిన వారిలో గ్రామస్థులు  కొలుకులపల్లి   యాదయ్య, వట్టికొటి శేఖర్, పగడాల ఆంజనేయులు,    శ్రీనివాస్,  లింగం, తదితరులు పాల్గొన్నారు.