సామాజిక సారథి, పెద్ద శంకరంపేట: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించినట్లు ఉమ్మడి జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు నగేష్ శేత్కార్, పీసీసీ సభ్యులు శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మాట్లాడుతూ పెద్ద శంకరంపేట పరిధిలో నవంబర్ 6వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కమలాపూర్ వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ యాత్రకు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నేతలు, యువకులు, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ శెట్కార్, మండల కాంగ్రెస్ నాయకులు రాయిని మధు, జహంగీర్, భాను, తదితరులు పాల్గొన్నారు.