సారథి న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9వ తరగతి.. ఆపై క్లాసెస్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ సలహాదారులు, ఆయాశాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ధరణి పోర్టల్ లో అవసరమైన అన్నిరకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తిచేయాలని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. అన్నిశాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలన్నీఒకేసారి వెంటనే భర్తీచేయాలని కోరారు. అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు, వైకుంఠ ధామాలు నిర్మించాలని సీఎం ఆదేశించారు.
- January 11, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- DHARANI PORTAL
- SCHOOLS OPENING
- TELANGANA
- తెలంగాణ
- ధరణి పోర్టల్
- ప్రగతిభవన్
- సీఎం కేసీఆర్
- స్కూళ్ల ఓపెనింగ్
- Comments Off on 9.. ఆపై తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేయండి