న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 75,760 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,023 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 60,472కు చేరుకున్నది. భారత్‌లో ప్రస్తుతం 7,25,991 యాక్టివ్ కేసులు ఉండగా.. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 33,10,235కు చేరుకుంది. వీరిలో 25,23,772 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తున్నప్పటికీ రికవరీ రేటు 76.24 శాతానికి చేరడం సానుకూల అంశంగా పరిణమించింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9,24,998 మంది కరోనా పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
- August 27, 2020
- Archive
- Top News
- జాతీయం
- CARONA
- CENTRAL
- DEATHS
- DELHI
- INDIA
- NEWCASES
- కరోనా
- కేంద్రవైద్య ఆరోగ్యశాఖ
- కొత్తకేసులు
- మరణాలు
- Comments Off on 60వేలు దాటిన మరణాలు