ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అదేస్థాయిలో మరణాలు కూడా రికార్డు అవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాటికి కరోనా కేసుల సంఖ్య 30,44,940కు చేరింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 912 మంది చనిపోయారు. ఇప్పటిదాకా దేశంలో కరోనా మరణాల సంఖ్య 57వేలకు చేరింది. మరో ఏడు లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 69,239 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 22,080 మంది కోలుకున్నారు. అయితే కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. తాజాగా 58వేల మంది మహమ్మారి బారినపడి కోలుకున్నారని కేంద్ర వైద్యారోగ్యశాఖ తన రిపోర్ట్‌లో వెల్లడించింది.
దేశంలో కరోనా వ్యాధి బాధితుల రికవరీ రేటు 74.69శాతానికి చేరింది. మరణాల రేటు1.87శాతంగా ఉంది. అలాగే భారత్‌లో కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లోనే 8లక్షల శాంపిళ్లను టెస్టు చేసినట్లు భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. ఇప్పటివరకు 3.52 కోట్ల శాంపిళ్లను పరీక్షించినట్లు స్పష్టంచేసింది.