ఢిల్లీ: మనదేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 55,079 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 27,02,742లకు చేరుకున్నది. ఇప్పటికీ 19,77,779 మంది కరోనానుంచి కోలుకున్నారు. కరోనాతో మృతిచెందిన వారిసంఖ్యకూడా గణనీయంగానే ఉన్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 51,797 మంది కరోనాతో మృతిచెందారు. 6,73,166 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రవైద్యశాఖ అధికారులు కోరారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని.. కరోనా సోకినా భయాందోళనకు గురికావొద్దని సూచించారు. సరైన వైద్యం తీసుకుంటే ఈ వ్యాధి నుంచి కోలుకోవచ్చన్నారు.