న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. కొత్తకేసులు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 32 వేల కొత్తకేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే టెస్టులు సరిగ్గా చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు భారత్లో 9,68,876 కేసులు నమోదయ్యాయి. 6,12,814 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటికి 24, 915 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,31,146 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో లాక్డౌన్ కష్టసాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా ప్రజలు స్వీయనిబంధనలు పాటించాలని వారు కోరుతున్నారు. కేసులు మరింత పెరిగితే మనకున్న వైద్యసిబ్బంది, వసతులు సరిపోకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అనుమానితులను ట్రేస్ చేయడం, టెస్టులు చేయడం, వారికి ట్రీట్మెంట్ చేయడం టీటీటీ విధానం ద్వారా కరోనాను అరికట్టవచ్చని వారు సూచిస్తున్నారు.