Breaking News

3 రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే

3 రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే

అమరావతి: మూడు రాజధానుల బిల్లుపై ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈనెల 14 వరకూ రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే విధించింది. రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. పిటిషన్ల తరఫున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్​దాఖలుకు 10 రోజుల సమయం కోరారు. విచారణను ఈనెల 14కు హైకోర్టు వాయిదా వేసింది.