సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం(24 గంటల్లో) 2,932 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,17,415కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 11మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారు 799 మంది ఉన్నారు. వ్యాధి బారినపడి ఆస్పత్రి నుంచి కోలుకుని 1,580 మంది డిశ్చార్జ్అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 87,675కు చేరింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 28,941కు చేరింది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 76.33 శాతంగా నమోదుకాగా, తెలంగాణలో రికవరీ రేటు 74.6 శాతంగా ఉంది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
- August 28, 2020
- Top News
- CARONA
- COVID19 CASES
- HYDERABAD
- TELANGANA
- కరోనా తెలంగాణ
- పాజిటివ్ కేసులు
- వైద్యారోగ్యశాఖ
- హైదరాబాద్
- Comments Off on 2,932 కరోనా కేసులు.. 11 మంది మృతి