సారథిన్యూస్, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ 27న (సోమవారం) సీఎంలతో సమావేశం కానున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, వైద్య సదుపాయాలు, వైరస్ కట్టడికి వ్యూహాలు, అన్లాక్ 3.0 ప్రక్రియ తదితర అంశాలపై సీఎంలతో ప్రధాని మోడీ చర్చించనున్నట్టు సమాచారం. కాగా రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు, కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, అన్ లాక్ 2.0 తర్వాత పెరిగిన కరోనా కేసులు, దేశంలో అత్యధికంగా జరుగుతున్న కరోనా టెస్టుల వంటి అంశాలపై కూడా చర్చిస్తారు. కంటైన్మెంట్ జోన్లలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ గడువు జూలై 31తో ముగుస్తుంది. ఈ క్రమంలో మరోసారి ముఖ్యమంత్రులతో చర్చించి కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 3.0 గైడ్ లైన్స్ రూపొందించనుంది. ప్రస్తుతం సినిమాహాళ్లు, విద్యాసంస్థలు, సినిమా షూటింగ్స్ లాంటివి మినహా షాపింగ్ మాల్స్ కూడా ఓపెన్ అయ్యాయి.
- July 25, 2020
- Archive
- Top News
- జాతీయం
- CARONA
- LOCKDOWN
- MODI
- కరోనా
- మోడీ
- లాక్డౌన్
- Comments Off on 27న సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం!