న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కరాళనృత్యం చేస్తున్నది. ఇప్పటివరకు 22,15,074 కేసులు నమోదయ్యాయి. కేవలం గత 24 గంటల్లోనే 62,064 మందికి కొత్తగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 6,34,949 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 44,386 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1,077 మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు 2.45 కోట్ల పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ తెలిపింది.