సారథి, మానవపాడు: 50 కాదు.. 100 కాదు.. 150 కేజీలకు పైగా ఉన్న బరువును ఈజీగా ఎత్తేశాడు ఈ కండరగండడు. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఇమ్రాన్ మాసుం బాషా గుండ్లను ఎత్తే ప్రదర్శనలో ఎప్పటినుంచో పాల్గొంటున్నాడు. ఇటీవల బక్రీద్పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా గుత్తి పెట్రోల్బంక్వద్ద సీఐటీయూ ఆటోడ్రైవర్ల యూనియన్ఆధ్వర్యంలో గుండ్లను ఎత్తే పోటీలో పాల్గొన్నాడు. 140, 160 కిలోల బరువైన గుండ్లను ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆటోడ్రైవర్లు మాసుం బాషాకు అభినందనలు తెలిపి సన్మానించారు. తనను ప్రభుత్వం గుర్తించి సహాయం చేస్తే దేశం కోసం వెయిట్లిఫ్టర్లను తయారుచేస్తానని చెబుతున్నాడు.
ఇమ్రాన్ మాసుం బాషాను సన్మానిస్తున్న నిర్వాహకులు