ముంబై: భారత క్రికెట్లో కురువృద్ధుడు వసంత్ రాయిజీ (100) పరమపదించారు. వయోధిక భారంతో వచ్చే సమస్యలతోనే ఆయన తుదిశ్వాస విడిచారు. 1940లో తొమ్మిది ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడిన రాయిజీ.. 277 పరుగులు సాధించాడు. ఇందులో అత్యధిక స్కోరు 68 పరుగులు. 1933లో టీమిండియా తొలి టెస్ట్ ఆడినప్పుడు రాయిజీ వయసు 13 ఏళ్లు. అప్పట్నించి.. ఇప్పటివరకు భారత క్రికెట్ ప్రయాణాన్ని పూర్తిస్థాయిలో చూశాడు. 1939లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రాయిజీ.. సెంట్రల్ ప్రావిన్సెస్, బేరార్ జట్లపై ఆడాడు. 1941లో బాంబేకు ఆడిన రాయిజీ.. బరోడా తరఫున రంజీల్లో బరిలోకి దిగాడు. రాయిజీ మృతికి.. క్రికెటర్లతో పాటు బీసీసీఐ, సీసీఏ తమ సంతాపాన్ని ప్రకటించారు.
- June 14, 2020
- Archive
- Top News
- క్రీడలు
- 100 YEARS
- CRICKETER
- VASANTH RAI
- టీమిండియా
- వసంత్ రాయిజీ
- సీసీఐ
- Comments Off on 100 ఏళ్ల క్రికెటర్.. ఇక లేరు