- కరోనా మరణాలపై డబ్ల్యూహెచ్ వో చీఫ్ సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న విలయతాండవానికి లక్షలాది మంది ప్రజలు బలవుతున్నారు. అయితే వివిధ దేశాలు నివేదిస్తున్న మరణాల లెక్కలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా దేశాలు కరోనా మరణాలను చూపించడం లేదని, చాలా దేశాలు వాటిని దాచి పెడుతున్నాయని సర్వత్రా ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో అమెరికాలో ప్రెసిడెన్షియల్ డిబేట్ లో భాగంగా యూఎస్ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారతదేశం కరోనా మరణాలు దాస్తోందని ఆయన వ్యాఖ్యానించడంతో ఈ అంశంపై చర్చ మళ్లీ మొదలైంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రస్ అథోనమ్ స్పందిస్తూ.. వాస్తవానికి కరోనా మరణాలు 10 లక్షల కంటే ఎక్కువే నమోదు కావొచ్చని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లోనే మరణిస్తున్నారని ఆయన చెప్పారు మహమ్మారిని అంతం చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి ముందుకు రావాలని ఆయన సూచించారు.