Breaking News

హైకోర్టులోనూ పైలట్​కే అనుకూలం

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సచిన్​ పైలట్​కు హైకోర్టులో మరోసారి ఊరట దక్కింది. సచిన్​ పైలట్​ వర్గం ఎమ్మెల్యేలపై రాజస్థాన్ స్పీకర్​ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై పైలట్​ ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. గురువారం దీనిపై కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈకేసులో కేంద్రాన్ని కూడా చేర్చాలంటూ పైలట్​ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిని కోర్టు స్వీకరించింది. ఈ కేసులో తుదితీర్పు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది. పైలట్​ తిరుగుబాటుతో రాజస్థాన్​ స్పీకర్​ 19 మంది రెబల్​ ఎమ్మెల్యేలపై నోటీసులు జారీచేశారు. ఈ నోటీసులను సవాల్​చేస్తూ సచిన్​పైలట్​ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. కాగా తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై కోర్టు స్టే విధించింది. కాగా హైకోర్టు స్టేను ఎత్తేయాలంటూ రాజస్థాన్​ స్పీకర్​ సుప్రీంను ఆశ్రయించగా సుప్రీం తోసిపుచ్చింది. ఈ అంశంపై సుదీర్ఘ విచారణ చేపడతామని చెప్పింది. కేసును ఈ నెల 27 కు వాయిదా వేసింది.