Breaking News

హీరో రామ్​ ట్వీట్​.. వైఎస్సార్సీపీ మండిపాటు

సారథిన్యూస్​, హైదరాబాద్​: ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్మోహన్​రెడ్డిపై సినీహీరో రామ్​ పొతినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా రామ్​ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కోవిడ్​ సెంటర్​గా ఉన్న విజయవాడలోని స్వర్ణప్యాలెస్​లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది కరోనా పేషెంట్లు మృతిచెందారు. కాగా రమేశ్​ హాస్పిటల్​కు చెందిన కరోనా పేషెంట్లను.. హోటల్​ స్వర్ణప్యాలెస్​లో ఉంచి వారికి వైద్యం అందిస్తున్నారు. కాగా ఈ ఘటనపై ఏపీప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. అప్పటి నుంచి రమేశ్​ హాస్పిటల్​ యజమాని రమేశ్ బాబు​ పరారీలో ఉన్నాడు. కాగా సదరు ఆస్పత్రి యజమాని రమేశ్​ సోదరుడి కుమారుడు రామ్​ పోతినేని తాజాగా ఈ వివాదంపై వరుస ట్వీట్లు పెట్టాడు. ‘సీఎం జగన్​గారు. మీ చుట్టూ ఉన్న కొంతమంది మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి వల్ల సీఎం మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్​ కలుగుతుంది. ఇకనైనా మీ చుట్టూ ఉన్నవాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం’ అంటూ ఓ ట్వీట్​ పెట్టారు. ‘అందరినీ ఫూల్స్​ చేయడానికే ఈ మ్యాటర్​ను ఫైర్​ వైపు నుంచి ఫీజు వైపు మళ్లించారా’ అంటూ మరో ట్వీట్​ పెట్టారు. ‘జగన్​గారు రమేశ్​ హాస్పిటల్​ కంటే ముందు.. ఇక్కడ ప్రభుత్వమే స్వయంగా కోవిడ్​ సెంటర్​ను నడిపేది. ఒకవేళ అప్పడు ప్రమాదం జరిగి ఉంటే నేరం ఎవరిపై నెట్టేవారు’ అంటూ మరో ట్వీట్​ పెట్టారు. కాగా రామ్​ ట్వీట్​పై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. స్వర్ణప్యాలెస్​లో 10 మంది చనిపోతే స్పందించని రామ్​.. ఇప్పుడు ఆయన బాబాయ్​ చిక్కుల్లో పడ్డాడు కాబట్టి ముందుకొచ్చాడని ఆరోపించారు. ఎవరెన్ని ఒత్తిడిలు తీసుకొచ్చినా చట్టం తనపని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.