చండీగఢ్: హర్యానాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సుధాకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. సుభాష్ కురుక్షేత్ర జిల్లాలోని థానేసర్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఆయన కొంతకాలంగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని తెలిందని ఆయన వ్యక్తిగత సహాయకుడు అరుణ్ గులాటి మీడియాకు తెలిపారు. జూన్ 21న సంభవించిన సూర్యగ్రహణం రోజున నిర్వహించిన ఓ పూజలో ఆయన పాల్గొన్నట్టు సమాచారం. ఆ పూజకు 200 మందిదాకా హజరయ్యారు. ప్రస్తుతం వారందరికి భయం పట్టకున్నది.
- June 29, 2020
- Archive
- జాతీయం
- BJP
- CARONA
- HARYANA
- MLA
- PRIVATE
- చండీగఢ్
- సూర్యగ్రహణం
- Comments Off on హర్యానా ఎమ్మెల్యేకు కరోనా