సారథి న్యూస్, రామడుగు: మనీషా వాల్మికిపై లైంగికదాడి జరిపిన నిందితులను వెంటనే ఉరితీయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో మనీషా పై నలుగురు దుండగులు లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. శనివారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులు మనీష చిత్రపటంతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తడగొండ శంకర్ మాట్లాడుతూ.. హథ్రాస్ ఘటనపై వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేణిగుంట పిరాజ్, శనిగారపు హనుమయ్య, తడగొండ రాజు, కొత్తూరు బాబు, కర్ణాకర్, ప్రభాకర్ పౌల్, వెంకటేశ్, సాయి బాగన్, సోను, మునిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
- October 10, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- HATHRAS
- HYDERABAD
- TELANGANA
- UTTARPRADESH
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- హథ్రాస్ఘటన
- హైదరాబాద్
- Comments Off on హథ్రాస్ నిందితులను ఉరి తీయాలి