Breaking News

స్వచ్ఛందంగా లాక్ డౌన్

స్వచ్ఛందంగా లాక్ డౌన్

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో ఐదు కరోనా కేసులు నమోదు కావడంతో కలకలం చెలరేగింది. స్థానిక పీ‌హెచ్‌సీ లో రాపిడ్ టెస్ట్ లు ప్రారంభించడంతో స్థానికంగా ఉన్న వారితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారు సైతం టెస్ట్ లు చేయుంచుకుంటున్నారు. దీంతో కేసులు కొత్తగా వెలుగు చూస్తున్నాయి. మూడు రోజుల నుంచి మొత్తం ఐదుకేసులు నమోదు కావడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మేజర్ గ్రామ పంచాయతీ కావడం తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నివారణ చర్యలు ఎలా తీసుకోవాలనే అంశం పై చర్చించారు.

పెద్దశంకరంపేట ఎం‌పీపీ జంగం శ్రీనివాస్ అద్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి కిరాణా షాపులు ఇకపై రోజుకు ఆరుగంటలు పనిచేయాలని తీర్మానించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు తెరిచి ఉంచాలని, ఆ తర్వాత మూసివేయాలని నిర్ణయించారు. అలాగే ప్రతి గురువారం జరిగే అంగడి రద్దు చేస్తూ తీర్మానం చేశారు. సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, పట్టణం లోని కిరాణా వర్తక సంఘం బాధ్యులు, వస్త్రదుకాణ సంఘం బాధ్యులు, మండల తహసీల్దార్​ మనోహర చక్రవర్తి పాల్గొన్నారు.