న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తోంది. గత వారం రోజులుగా కేసుల సంఖ్య దాదాపు 11 వేల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో 24 గంటల్లో 10,956 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 2,97,535కు చేరింది. దీంతో ఇప్పటివరకు ఆరో స్థానంలో ఉన్న మన దేశం ఒక్కసారిగా నాలుగో స్థానానికి చేరింది.స్పెయిన్, యూకేలను దాటేసింది. 24 గంటల్లో 396 మంది వ్యాధి బారినపడి చనిపోయారు.
మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 3,607 కేసులు నమోదయ్యాయి. 152 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు పెరగడం, మరణాలు నమోదవడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర.. కెనడాను దాటేసింది. ముంబైలో ఇప్పటి వరకు 54,085 కేసులు ఉన్నాయి. తమిళనాడులో 38,716 కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 53,63,445 శాంపిల్స్‌ను టెస్ట్ చేశారు. 24 గంటల్లో 1,50,305 మందికి టెస్టులు నిర్వహించారు.