సారథిమీడియా, హైదరాబాద్: ఏఐసీసీ (ఆల్ఇండియా కాంగ్రెస్ కమిటీ) తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీకి ఆ పార్టీలోని సీనియర్లు ఓ ఘాటు లేఖను రాశారు. సోమవారం సీడబ్ల్యూసీ సమావేశం జరుగునున్న నేపథ్యంలో ఈ లేఖ వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ప్రస్తుత విపత్కకర పరిస్థితుల్లో పార్టీని బతికించాలని.. అందుకోసం పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేపట్టాలని లేఖలో కాంగ్రెస్ సీనియర్లు కోరారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్నదని.. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ లేఖ మీద కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు గులాంనబీ ఆజాద్, కపిల్ సిబల్, భూపేందర్ సింగ్ హుడా, పృథ్వీరాజ్ చవాన్, శశిధరూర్, జితిన్ ప్రసాద్ వంటి సీనియర్ నాయకులున్నారు. యువనేత రాహుల్‌గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు విముఖత చూపుతున్న ప్రస్తుత తరుణంలో కొత్త అధ్యక్షుడు ఎవరన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. మరోవైపు ప్రియాంకాగాంధీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి సుముఖంగా ఉన్నప్పటికీ.. సోనియాగాంధీ అందుకు అంగీకరించడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని సంక్షభం నుంచి ఎవరు గట్టెక్కిస్తారో అని సోనియా అలోచిస్తున్నారట. కాగా ఇప్పడు వెలుగులోకి వచ్చిన ఈ లేఖ కాంగ్రెస్ పార్టీలో పెను సంచలనంగా మారింది. ఈ పరిస్థితుల్లో సీబడబ్ల్యూసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందో అని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
- August 23, 2020
- Archive
- Top News
- జాతీయం
- CONGRESS
- LETTER
- NEWPRESIDENT
- PARTY
- RAHULGANDHI
- SONIAGANDHI
- కాంగ్రెస్
- కొత్త అధినేత
- సీనియర్లు
- Comments Off on సోనియాకు సీనియర్ల ఘాటు ‘లేఖ’