ఎవరికైనా బర్త్ డే అంటేనే స్పెషల్. అలాంటిది తమ ఫేవరెట్ హీరో బర్త్ డే అంటే మామూలు స్పెషల్ కాదు. యూత్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యే పవర్ స్టార్ పవన్ బర్త్ డే సెప్టెంబర్ 2న. ఇంకెంతో దూరం లేని ఆ రోజు కోసం విడుదలయ్యే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్, టీజర్స్ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేయడం కామన్. పవన్ లాంటి క్రేజీ హీరో బర్త్ డే సందడి.. ఎదురుచూపులు ఇంకాస్త ఎక్కువే ఉంటాయి.
సెప్టెంబర్ 2 సమీపిస్తుండడంతో ప్రస్తుతం అలాంటి సెలబ్రేషన్ మూడ్ పవన్ ఫ్యాన్స్ లో కనిపించడంలో అతిశయోక్తి లేదు. అభిమానులను మరింత ఉత్సాహపరుస్తూ ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ ట్వీట్ చేశాడు. ‘వెడ్ నెస్ డే’ అని పవన్ బర్త్ డే డేట్‌ను గుర్తుచేస్తూ ఆ రోజు ఏదో స్పెషల్ రిలీజ్ చేయబోతున్నట్టు హింట్ కూడా ఇచ్చాడు. దీంతో బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్ లేదా టీజర్ రిలీజ్ రావొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ‘మగువా మగువా’ అంటూ సాగే ఓ పాట విడుదలై ఆకట్టుకుంది. ఇక ‘వకీల్‌సాబ్’ తర్వాత పవన్ క్రిష్, హరీశ్‌శంకర్ సినిమాల్లో నటించాల్సి ఉంది.