సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణం కోసం రోడ్లు భవనాల శాఖలో సూపరింటెండెంట్ ఇంజనీర్ సూపర్ న్యూమరరీ పోస్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. రిటైర్డ్ ఇంజనీర్ సత్యనారాయణను ఆ పోస్టులో నియమించింది. ఏడాది పాటు లేదా పని పూర్తయిన తర్వాత ఈ సూపర్ న్యూమరరీ పోస్ట్ లాప్స్ కానుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం రాత్రి ప్రభుత్వం జారీచేసింది. ఇప్పటికే నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ ను ఖరారుచేశారు. సెక్రటేరియట్ లో ఉద్యోగులు, సిబ్బంది అంతాకలిసి పనిచేసేలా డిజైన్ చేశారు. కొత్త సెక్రటేరియట్ లో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్స్ కూడా అన్ని సౌకర్యాలతో ఉండనున్నాయి. ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్ హాలు, మీటింగ్ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్, అన్ని వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉండేలా నిర్మాణం చేయనున్నారు.
- August 18, 2020
- Top News
- తెలంగాణ
- ముఖ్యమైన వార్తలు
- HYDERABAD
- NEW SECRETARIAT
- TELANGANA
- కొత్త సెక్రటేరియట్
- తెలంగాణ
- సీఎం కేసీఆర్
- హైదరాబాద్
- Comments Off on సెక్రటేరియట్ పర్యవేక్షణకు కొత్త పోస్ట్