సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ భవనాల కూల్చివేతపై విచారణను హైకోర్టు శుక్రవారం నాటికి వాయిదావేసింది. ఈ విషయమై దాఖలైన పిల్‌పై గురువారం కోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర పర్యావరణ అనుమతులు కూల్చివేత పనులకు అవసరమా? లేదో చెప్పాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ను హైకోర్టు కోరింది. ఎన్వీరాన్ మెంట్ రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ కు సంబంధించి పలు జడ్జిమెంట్కాపీలను ఏజీ సమర్పించారు. భవనాల కూల్చివేతకు ఎన్వీరాన్ మెంట్ రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ అనుమతి అవసరం లేదని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రిపరేషన్ ఆఫ్ ల్యాండ్ లో కూల్చివేత కూడా వస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం 2018లోని నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేత పనులు చేపడుతున్నారని వాదనలు వినిపించారు. కేంద్ర పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం ఏం చెబుతుందో తెలపాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ను హైకోర్టు కోరింది. భవనాల కూల్చివేత సమస్య కేంద్రం చేతిలో ఉందని స్పష్టంచేసింది. ఎన్వీరాన్ మెంట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం భవనాలను కూల్చివేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ అనుమతి తీసుకోవాలని సూచించింది. ఎన్వీరాల్ మెంట్ రెగ్యులేటర్ ఆఫ్ ఇండియా అనుమతులపై తుదినిర్ణయం వెల్లడించాకే తుదిప్రకటన ఇస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. భవనాల కూల్చివేతలకు అనుమతి అవసరం లేదని, కేవలం భవనాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉందని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. జీహెచ్ఎంసీ, లోకల్ అథారిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు సరిపోతాయని వివరించారు. తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారం నాటికి వాయిదా వేసింది.